ముంబై: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటి విద్యాబాలన్ , ఇదివరకే సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు దానికి కంప్లీట్ ఒప్పొసిట్ అయిన మరొక సినిమా ‘శకుంతలా దేవి‘ బయో పిక్. మానవ కంప్యూటర్ గా ప్రసిద్ధి చెందిన మాథెమేటిషియన్ శకుంతల దేవి జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన శకుంతలదేవి బయోపిక్ ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. శకుంతల దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయి మెప్పించిందనే చెప్పాలి. దాదాపు 3 నిమిషాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్ వినోదంగా మరియు ఎమోషనల్ గా కూడా ఉంది. ఎంతో సరదాగా విద్యాబాలన్ శకుంతల దేవి పాత్రను నడిపిస్తూనే ఎమోషనల్ గా ఆలోచనలో పడేస్తోంది.
ఈ సినిమాలో శకుంతల దేవి ని బాల్యం నుండి అంచలంచెలుగా ఎదిగిన తీరుని గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసే స్టేజి అలాగే తాను ఒక తల్లి అయిన తర్వాత ఉండే ఎమోషన్స్ ఇలా చాలా స్టేజెస్ చూపించినట్టు తెలుస్తుంది. ఈ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త జీవిత ప్రయాణంలో కుటుంబం భర్త పిల్లలు, ఇలా అన్నీ అంశాలను మేళవించారు మేకర్స్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో జులై 31 న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు