మూవీడెస్క్: శ్రీరాముడి పాత్రలో విజయ్ దేవరకొండ? ఇతిహాస కథలు సినిమాలు మరియు సీరియల్స్ రూపంలో చాలా కాలం నుంచి ప్రేక్షకులను అలరించాయి.
రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల కథలను ఎన్ని సార్లు తెరపై చూపించినా, వీటికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.
ఈ కథల ప్రత్యేకతను తెలియజేయడం కోసం ఇప్పుడు కొత్త సాంకేతికతలను, విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ వంటి చిత్రాలతో ఇతిహాస కథలను సూపర్ హీరో కథలుగా పునఃసృష్టి చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాతో మహాభారతం వంటి కథలను ఆధారంగా తీసుకొని కొత్త తరహా సినిమాను అందించాడు.
హిందీలో నితీష్ తివారీ కూడా రామాయణాన్ని సిరీస్‌గా రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు, తెలుగు ప్రేక్షకులకు మరొక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
ప్రముఖ దర్శకుడు రామాయణం కథను ఆధారంగా తీసుకొని ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండను శ్రీరాముడు పాత్రలో నటించడానికి ఎంపిక చేయాలని అనుకుంటున్నారట.
విజయ్‌తో ఇప్పటికే కథ గురించి చర్చించినట్లు సమాచారం, కానీ ఆయన ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
విజయ్ ‘కల్కి 2898 ఏ.డీ‘ సినిమాలో అర్జునుడిగా కనిపించాడు. ఆయన ఆ పాత్రలో ఎంత బాగా సెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే నిజంగా రామాయణంలో శ్రీరాముడిగా నటించడం అతని కెరియర్‌కు పెద్ద మలుపు కావచ్చు. విజయ్ ఈ అవకాశాన్ని స్వీకరించగలిగితే, అది అతని సినీ ప్రయాణంలో ముఖ్యమైన అడుగు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.