విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్‌డమ్ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజువల్ ట్రీట్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు, టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో కృషి చేస్తున్నారు.
ఇప్పుడీ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండకు అన్నయ్యగా కనిపించనున్న సత్యదేవ్ పాత్రకు ఇంటెన్స్ ఎమోషనల్ టచ్ ఉంటుందని టాక్. వారి కెమిస్ట్రీ, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ సంబంధాలు, బలమైన ఎమోషన్లు ప్రధానంగా చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సత్యదేవ్ పాత్ర, కథలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. మే 30న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.