‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేసి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ చిత్రాలు ఆ స్థాయిలో ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి.
కానీ తన కథల ఎంపికలో ప్రయోగాలు చేస్తూ తనదైన శైలిలో సాగుతున్నాడు. ఇప్పుడు ఆయన మళ్లీ విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
విజయ్ ఇప్పటికే VD12, VD14 సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్నేహితుడిగా ఉండే తరుణ్ కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం మునుపటిలానే కొనసాగుతుందని టాక్.
‘పెళ్లిచూపులు’ తరహాలో కాకుండా ఈసారి మరింత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చే అవకాశముంది. దీనివల్ల బాక్సాఫీస్ పరంగా మంచి వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. విజయ్‌కి మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడిగా తరుణ్‌కు మంచి రీస్పెక్ట్ ఉంది.
ఈ కాంబినేషన్ మళ్లీ వస్తే, ఫ్యాన్స్‌కి పండగే. స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటే, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రౌడీ మరోసారి తన మొదటి దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.