fbpx
Wednesday, September 18, 2024
HomeMovie Newsవిజయ్ GOAT - బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..

విజయ్ GOAT – బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..

VIJAY-GOAT-MOVIE-COLLECTIONS-STATUS-AFTER-WEEK
VIJAY-GOAT-MOVIE-COLLECTIONS-STATUS-AFTER-WEEK

మూవీడెస్క్: ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘గోట్‘ GOAT మిక్స్ డ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను సంతృప్తిపరచడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.

అయితే, టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా మాత్రం ‘గోట్’ భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.126.32 కోట్ల వసూళ్లను అందుకోవడంతో పాటు, తొలి వారాంతానికి నాలుగు రోజుల్లో రూ.288 కోట్లను దాటింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను సాధించింది, ఇప్పటివరకు $14.26M (రూ.120 కోట్ల) వసూళ్లు రాబట్టింది.

మరోవైపు కేరళలో మాత్రం ‘గోట్’ భారీ నష్టాలను చవిచూసింది. మొదటి రోజు కేవలం రూ.5.80 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించగా, నాలుగు రోజులకు గాను కేవలం రూ.10.40 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టింది.

ఇది డిస్ట్రిబ్యూటర్ గోకులం మూవీస్ కు నష్టాలను కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ తీసుకోగా, మొదటి నాలుగు రోజులకు గాను రూ.10.10 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చాయి.

తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరింత దూకుడు అవసరం, కానీ ఆ అంచనాలు సాధ్యంకావడం కష్టమే.

కన్నడలో మాత్రం స్థిరంగా కొనసాగుతూ రూ.21.10 కోట్ల వసూళ్లను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular