తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించిన జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, ఈ సినిమాతో తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పబోతున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
శతురంగ వేట్టై ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మామిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ పాటలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
వారు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్. విజయ్‌తో మాస్టర్, లియో, తెరి, మెర్శల్, బీస్ట్ లాంటి సినిమాలు చేసిన వీరు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే, అది సెన్సేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.
ఇక కథ విషయానికి వస్తే, ఇది ఓ రీమేక్ అంటూ వార్తలు వచ్చినా, టైటిల్ రివీల్ తర్వాత ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ అనిపిస్తోంది. సినిమా టీజర్ వస్తేనే అసలు కథ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను విజయ్ తన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్‌గా అందించబోతున్నాడు. ఇది ఆయన చివరి సినిమా కావడంతో, ఓ రేంజ్ ప్రమోషన్స్ ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.