fbpx
Friday, April 11, 2025
HomeMovie Newsతెలుగులో విజయ్ 'మాస్టర్' టీజర్

తెలుగులో విజయ్ ‘మాస్టర్’ టీజర్

Vijay MasterMovieTeaserIn Telugu

కోలీవుడ్: తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మాస్టర్’. షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అవబోయే టైం లో కరోనా కారణంగా ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడి వచ్చింది. ఇపుడు థియేటర్ లు తెరచుకోనుండడం తో అతి త్వరలో విడుదల చేసే ఉద్దేశ్యంలో సినిమా నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన పాటలు , టీజర్ లు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు తమిళ్ అప్ డేట్స్ వచ్చాయి కానీ తెలుగు లో ఈ సినిమా వస్తుందా లేదా అనే అప్ డేట్ ఏమీ లేదు. అయితే ఈ సినిమాకి సంబందించిన తెలుగు టీజర్ విడుదల చేసి తెలుగులో కూడా సినిమా విడుదల అవుతుంది అని తెలియచేసారు.

సూర్య కి ఉన్నంత మార్కెట్ విజయ్ కి తెలుగులో లేకపోయినా కూడా ‘తుపాకీ’, ‘అదిరింది’ లాంటి సినిమాల ద్వారా ఇక్కడ కూడా కొంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పటినుండి విజయ్ సినిమాలు అన్నీ తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. కార్తీ తో ‘ఖైదీ’ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో రూపొందింది. మిగతా టెక్నికల్ అంశాలు అన్నీ తమిళ్ టీజర్ లో చూసినట్టే ఉంటాయి కానీ తెలుగు టీజర్ లో డబ్బింగ్ మాత్రం మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. టీజర్ లో వచ్చిన కొన్ని సంభాషణలు విన్న తర్వాత మాత్రం ఈ సినిమాని తమిళ్ లోనే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడడం ఉత్తమం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టేలా ఉంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని సంక్రాతి సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Master Official Teaser - Telugu | Thalapathy Vijay | Anirudh Ravichander | Lokesh Kanagaraj

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular