తమిళనాడు: స్టార్ హీరో విజయ్ తన రాజకీయ పయనాన్ని వేగవంతం చేశారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీ స్థాపించిన విజయ్, ఇకపై పూర్తి స్థాయి రాజకీయాలకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ కు శాంతి భద్రతలపై పిటిషన్ అందజేసిన విజయ్, తమిళనాడులో మహిళల భద్రత క్షీణించిందని ఆరోపించారు.
అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై గవర్నర్ దృష్టి ఆకర్షించారు. డీఎంకే ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని విజయ్ లేఖలో పేర్కొన్నారు.
ఫెన్గల్ తుపాను బాధితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని, కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు చేయించేందుకు గవర్నర్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలు తమిళ రాజకీయాలలో విస్తృత చర్చకు దారితీశాయి. డీఎంకే నేతలు విజయ్ వ్యాఖ్యలకు ఎలా ప్రతిస్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.