fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsవిజయ్ వారసుడితో సందీప్ కిషన్ మూవీ

విజయ్ వారసుడితో సందీప్ కిషన్ మూవీ

VIJAY-SON-COMING-WITH-SANDEEP-KISHAN
VIJAY-SON-COMING-WITH-SANDEEP-KISHAN

మూవీడెస్క్: ఇళయదళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ తన ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

తండ్రి స్ఫూర్తితో హీరోగా కాకుండా, దర్శకుడిగా తనను పరిచయం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఫ్యాన్స్ అతన్ని హీరోగా చూడాలని ఆశిస్తుండగా, జేసన్ మాత్రం వెండితెర వెనుక ప్రస్థానం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే పలు సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేసిన జేసన్, తన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.

సందీప్ కిషన్, తమిళ సినిమాలలో కూడా సత్తా చాటుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మొదటి సినిమా సందీప్ కిషన్ తోనే చేశాడు, అదే నగరం.

ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయం సాధించింది. జేసన్ విజయ్ తన మొదటి సినిమాకి సందీప్ కిషన్ సరైన ఎంపిక అని తెలుస్తోంది.

కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాల్లో సందీప్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అలాగే, ధనుష్ తో కలిసి నటించిన రాయన్ సినిమాలో కూడా అతని పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

అందుకే, జేసన్ విజయ్ తన డెబ్యూ చిత్రానికి సందీప్ కిషన్ ను హీరోగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular