మూవీడెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎమోషనల్ డ్రామాతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనున్నాయని టాక్.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల వేగంగా జరుగుతుండగా, ఫస్ట్ లుక్ విడుదలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే సంచలనంగా మారింది.
“విధి అతని కోసం ఎదురు చూస్తోంది” అనే క్యాప్షన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.
విజయ్ గాయాలతో, రగిలే లుక్స్ లో కనిపించిన ఈ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అయ్యింది. తాను ఎన్నడూ చేయని మాస్ పాత్రలో విజయ్ కనిపించనున్నారు.
ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా మేకర్స్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. జనవరి మధ్య నుంచి గోవాలో మరో భారీ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
గోవా తర్వాత కోల్‌కతాలో జరిగే హిస్టారికల్ ఎపిసోడ్ చిత్రీకరణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్.
ఇది థియేటర్లను షేక్ చేసే సన్నివేశంగా రూపొందుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.
విజయ్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ హిస్టారికల్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.