కోలీవుడ్: 2016 సంవత్సరంలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయినా సినిమా బిచ్చగాడు. ఆ సినిమాతో విజయ్ ఆంథోనీ తెలుగు ప్రేక్షకులకి హీరోగా సుపరిచితం అయ్యాడు. అంతకముందు సంగీత దర్శకుడిగా తెలుగులో కొన్ని సినిమాలు చేసిన కూడా అంతగా పేరు రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా మంచి పేరు కూడా సంపాదించారు. ఈ సినిమాకి విజయ్ ఆంథోనీ హీరో గా మాత్రమే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా పని చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా బిచ్చగాడు 2 సిద్ధం చేస్తున్నాడు ఈ హీరో. ఈ రోజు విజయ్ ఆంథోనీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా టీం.
మొదటి పార్ట్ దర్శకత్వం వహించిన శశి అమ్మ సెంటిమెంట్ తో సినిమాని విజయవంతం చేసాడు. రెండవ పార్ట్ కి జాతీయ అవార్డు గ్రహీత ప్రియా కృష్ణస్వామి కి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ దర్శకురాలు 2018 సంవత్సరంలో విడుదలైన భారం అనే తమిళ్ సినిమాకి ఎడిటర్ అలాగే దర్శకుడిగా పని చేసారు. ఆ సినిమాకి ఆ సంవత్సరంలో బెస్ట్ ఫీచర్ ఫిలిం తమిళ్ క్యాటగిరీ లో జాతీయ అవార్డు లభించింది. బిచ్చగాడు 2 ని కూడా విజయ్ ఆంథోనీ నే తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2021 లో విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు.