కోలీవుడ్: మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యి హీరోగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంథోనీ. విజయ్ ఆంథోనీ హీరో గా రూపొందిన ‘బిచ్చగాడు’ సినిమా తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అనూహ్యమైన హిట్ అవడం తో విజయ్ ఆంథోనీ పాత సినిమాలతో పాటు విజయ్ నుండి వస్తున్న ప్రతి సినిమా ఇక్కడ కూడా డబ్ అవుతూ ఎంతో కొంత కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం విజయ్ ఆంథోనీ ‘విజయ రాఘవన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
ఈ సినిమాలో విజయ్ పాలిటిక్స్ ని టచ్ చేయనున్నాడు. ఒక ఏరియా లో ఉంటూ IAS కోసం ప్రిపేర్ అయ్యే పాత్రలో విజయ్ కనిపిస్తున్నాడు. ఆ ఏరియా లోని పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఆ ఏరియా లో ఉండే అన్యాయాన్ని ఎదురించే పాత్రలో విజయ్ కనిపించాడు. ఎలక్షన్స్ సమయంలో ఇచ్చే వాగ్దానాలు, వాటిపై ఉద్యోగ ప్రయత్నంలోనే పోరాడుతూ చివరకి ఉద్యోగం సంపాదించి పెద్ద పొజిషన్ కి వెళ్లిన తర్వాత కూడా సమస్యల్ని ఎదుర్కొనే పాత్ర ఇది అన్నట్టు ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. రాజకీయ నాయకులు తమ పరపతిని వాడి పెద్ద పెద్ద నేరాలకు పాల్పడుతూ చిన్న చిన్న పనులు చేసే స్టూడెంట్స్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం లాంటి అంశాలని ట్రైలర్ లో ప్రస్తావించారు.
ఓవరాల్ గా పదవి లో ఉన్న ప్రజా ప్రతినిధులు మరియు రాయకీయ నాయకుల అన్యాయానికి ఎదురు నిలిచే సినిమా అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఒక రకంగా చూస్తే శంకర్- అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ ఛాయలు కొంచెం కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ కి జోడీ గా ఆత్మిక నటిస్తుంది. చెందూర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రాజా మరియు సంజయ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆనంద కృష్ణన్ అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు.