రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తనపై జగన్ అక్రమాస్తుల కేసులో అప్రూవర్‌గా మారాలని ఒత్తిడి జరిగిందని చెప్పిన విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. విజయసాయిపై వచ్చిన ఒత్తిడిపై తనకు ఇప్పటివరకు సమాచారం లేదని, ఈ విషయాన్ని విజయసాయి స్వయంగా చెప్పడం బాధాకరమని అంబటి పేర్కొన్నారు.
“జగన్ మోహన్ రెడ్డి గారిపై ఆధారాలు లేకుండా కక్ష సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్రూవర్‌గా మారమని ఒత్తిడి చేయడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం చంద్రబాబు కుట్రలే,” అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్‌పై ఆధారాలు లేనందునే, ఆయనను రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబటి అన్నారు. విజయసాయిపై ఒత్తిడి చేసిన వాళ్లెవరో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
“ఈ కేసులో నిజం ఉంటే అప్రూవర్ కోసం ఒత్తిడి అవసరం లేదు. చంద్రబాబు లక్ష్యం జగన్‌ను ఇబ్బంది పెట్టడమే,” అంటూ విమర్శలు గుప్పించారు.