ఏపీ: కాకినాడ సీ పోర్ట్, సెజ్ సంబంధిత అక్రమ బదిలీల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను ఒక్కసారి విచారించిన అధికారులు, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు.
మార్చి 25న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గత బుధవారం విజయసాయిని సీఐడీ అధికారులు బెజవాడ కార్యాలయంలో దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. అప్పట్లోనే మరోసారి విచారణ అవసరమని ఆయనకు సూచించారు.
కేసు ప్రాధాన్యత దృష్ట్యా మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఈ రెండో విచారణ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ కేసులో విజయసాయితో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు ఫిర్యాదు మేరకు సీఐడీ చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవహారం రాజకీయంగా కీలకంగా మారుతోంది.