ఏపీ: లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన నిన్న హాజరవుతానని సమాచారం ఇచ్చినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆలస్యమయ్యారు.
ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి, విచారణకు సహకరించారు. సిట్ బృందంలోని ఆరుగురు అధికారులు విడతల వారీగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణలో విజయసాయి సంచలన విషయాలను వెల్లడించినట్టు సమాచారం.
లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డే ప్రధాన సూత్రధారి అని ఆయన వెల్లడించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే.. రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు పిలిపించినా, ఆయన ఆచూకీ మాత్రం ఇంకా బయటపడలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో విచారణకు ఆయన హాజరుకాలేకపోతున్నారు.
రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయసాయి, ఉపేందర్ రెడ్డిలను వేర్వేరుగా ప్రశ్నిస్తూ, ఒకరి సమాధానాలతో మరొకరిని కౌంటర్ చేస్తూ అధికారులు ఆమోఘంగా విచారణ జరుపుతున్నారు.