టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో మంది యువతరానికి ప్రస్తుతం ఈ హీరో ఆదర్శం. అతని ఆటిట్యూడ్, మాట్లాడే విధానం, మాట్లాడే దాన్లో ఉండే కంటెంట్ ఆయన ఇంటర్వ్యూలకి కట్టిపడేస్తాయి. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్‘ సినిమా విడుదల అయ్యి ఇవ్వాళ్టికి సరిగ్గా సంవత్సరం. ఈ సినిమా అంతగా ఆడనప్పటికీ ఈ సినిమాకి కల్ట్ క్లాసిక్ గా అభివర్ణించే ఫాన్స్ ఉన్నారు. ఒక వర్గం అభిమానులని ఈ సినిమా చాలా చాలా నచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. చక్కని సంగీతం, ఇన్స్పిరేషనల్ కంటెంట్, బాబీ లిల్లీ ల పెర్ఫార్మెన్స్ , వాళ్ళ మధ్య చూపించిన ప్రేమ… ఇలా ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి కానీ టైం కలిసిరాలేదు. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో లేదా సినిమా విడుదల అయినా టైమింగ్ సరిగ్గా లేదేమో తెలియదు కానీ సినిమా థియేటర్లలో అంతగా ఆడలేదు.
ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా కొన్ని విషయాలు షేర్ చేసాడు.
‘ఈ సినిమా గురించి ఈ సినిమాలో పని చేసిన వాళ్ళ గురించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయని ,
కానీ అవి మాటల్లో కన్నా వీడియో రూపం లో త్వరలో షేర్ చేస్తా అన్నాడు.
ఇప్పుడు ఈ సినిమా ఆఫర్ ఇచ్చినా కూడా ఆ టీం తో అదే స్టోరీ తో అదే డెడికేషన్ తో మళ్ళీ చేయడానికి నేను సిద్ధం. ఈ సినిమాలో నాతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది.
ఈ సినిమా కథ, సినిమా చేసినపుడు కలిగిన అనుభవాలు నన్ను మనిషిగా కొంచెం మార్చాయి. వాటి గురించి తప్పకుండ ఎదో ఒక రోజు మీతో మాట్లాడతా.
ఈ రోజు లిల్లీ , బాబీ ల ఫైట్ ని సెలెబ్రేట్ చేసుకుందాం,
ఈ సినిమా యొక్క అద్భుతమైన కథని, కథనాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం
అద్భుతమైన ఈ సినిమా మ్యూజిక్ ని సెలెబ్రేట్ చేసుకుందాం
ఈ సినిమా వెనక ఉన్న చావులేని పోరాటాన్ని సెలెబ్రేట్ చేసుకుందాం
చివరగా- పెద్ద పెద్ద కలలు కందాం, ఒకవేల ఆ కలలు నిన్ను నిద్ర పోనివ్వకపోతే ఆ కలలని నిద్రబోనివ్వద్దు’
అంటూ అద్భుతమైన మాటలతో ఇన్స్పిరేషనల్ మెమరీ ని షేర్ చేసుకున్నారు.