టాలీవుడ్: చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రతో గుర్తింపు తెచ్చుకుని ‘పెళ్లి చూపులు’ సినిమా ద్వారా టాక్ అఫ్ ఇండస్ట్రీ అయ్యాడు విజయ్ దేవరకొండ. తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో కేవలం రీజనల్ భాషలో విడుదల అయినా కూడా ఆ సినిమా సెన్సేషన్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తర్వాత కొన్ని హిట్లు కొన్ని ప్లాప్ లు చూసినా కూడా విజయ్ దేవరకొండ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి మొదటి సారిగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని సౌత్ ఇండియన్ భాషల్లో మరియు హిందీ భాషలో రూపొందిస్తున్నారు.
కరోనా ముందు వరకు షూటింగ్ బాగానే జరుపుకున్న ఈ సినిమా కరోనా మొదలవగానే ఆగిపోయింది. మామూలుగా పూరి జగన్నాథ్ సినిమాలు ఒక మూడు నెలల్లో పూర్తి అవుతాయి. కానీ ఈ సినిమాకి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు డైరెక్టర్. అయితే ఈ మధ్య ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్ వచ్చిందని 200 కోట్లకి అన్ని బాషల రైట్స్ కోసం ఓటీటీ ప్రయత్నించిందని దానికి మేకర్స్ కూడా సుముఖంగా ఉన్నారని ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. దీనికి విజయ్ దేవరకొండ రెస్పాండ్ అవుతూ ‘200 కోట్లు అంటే చాలా తక్కువ.. సినిమా విడుదలయ్యాక ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది’ అనే సమాధానం ఇచ్చి సినిమా పై తనకి ఉన్న కాన్ఫిడెన్స్ చెప్పాడు. ఏది ఏమైనా షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని సమయం చూసుకుని విడుదల చేసి విజయ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.