టాలీవుడ్: మెగా కుటుంబం నుండి మెగా ప్రిన్స్ అనే టాగ్ తో ‘ముకుంద’ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అన్నాడు వరుణ్ తేజ్. మొదటి నుండి కథ కి ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త దనం కోసం ప్రయత్నించే మెగా హీరో గా పేరు సంపాదించాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో వరుణ్ తేజ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ 19 వ తేదీ న విడుదల చేయనున్నారు. ఇందులో మరిన్ని ముఖ్య పాత్రల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ ఆక్టర్ సునీల్ శెట్టి ,జగపతి బాబు, నవీన్ చంద్ర నటించనున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు.
కారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణం ప్రారంభించి ‘పెళ్లి చూపులు’ సినిమా తో హీరో గా సక్సెస్ సాధించి ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించినా హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు 9 సినిమాలు పూర్తి చేసి పదవ సినిమా చేస్తున్నారు.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పూరి నిర్మాణంలోనే విజయ్ దేవరకొండ 10 వ సినిమాని ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్ ) అనే పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని 18 వ తేదీ న విడుదల చేయనున్నారు. యాదృచ్చికం ఏంటంటే ఈ ఇద్దరి హీరోల 10 వ సినిమా బాక్సింగ్ నేపధ్యం లో రూపొందుతున్నాయి. అంతే కాకుండా ఈ పదవ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ లు ఒకే రోజు గ్యాప్ లో రాబోతున్నాయి.