కోలీవుడ్: దళపతి విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’. సినిమా షూటింగ్ మొత్తం ముగించుకుని విడుదలకి సిద్ధం అవుతున్న సమయంలోనే కరోనా, లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సమయం చూసుకుని థియేటర్లు తెరచుకున్న తర్వాత విడుదల చేయడానికి మేకర్స్ చూస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ సినిమా నిర్మాతలకి ఒక ఓటీటీ కి చాలా పెద్ద మొత్తం లో బేరం కుదిరి ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేస్తున్నారు అని చాలా రూమర్స్ వినిపించాయి. అవి ఎంతకీ తగ్గకపోవడం తో సినిమా నిర్మాతలు అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేసారు.
ఈ సినిమా థియేటర్ లలోనే విడుదల అవుతుందని ఓటీటీ లో విడుదల చేయబోమని ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ తో పాటు విజయ్ సేతుపతి కూడా నటిచడం విశేషం. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా చాలా మందిని ఆకట్టుకుంది మరియు అంచనాలు కూడా బాగా పెరిగాయి. కార్తీ నటించిన ఖైదీ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ పైన అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా ద్వారా కూడా మరో హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కి జోడీ గా మాళవిక మోహనన్ నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.