టాలీవుడ్ లో మాస్టర్ అంటే మెగాస్టార్ చిరంజీవి కానీ తమిళ్ లో అదే సినిమా పేరుతో ఇళయతలపతి విజయ్ ప్రస్తుతం ఒక సినిమా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పాటలు సంగీత ప్రేమికుల్లో మారుమ్రోగిపోతున్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు విజయ్ కి బర్త్ డే విషెస్ తెలియచేసారు. విజయ్ తో పని చేసిన వారు , పని చేయని వారు అని తేడా లేకుండా చాల మంది ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిమాన హీరో కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
తాము చెప్పే విషెస్ లో కొందరు ప్రత్యేకత చాటుకున్నారు. మహానటి కీర్తిసురేష్ తాను లొక్డౌన్ లో నేర్చుకున్న వయోలిన్ తో విజయ్ నటించిన మాస్టర్ సినిమా లోని ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నంబా’ అనే పాట వాయించి బర్త్ డే విషెస్ తెలియచేసారు.
విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కి అనిరుద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ అని విడుదల అయిన పాటలని బట్టి తెలుస్తుంది. అలాగే విజయ్ తన తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగదాస్ తో చేస్తున్నారు. ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ లో హాట్ట్రిక్ పూర్తి చేసే ఆలోచన లో ఉన్నారు. ఈ సినిమా తో థమన్ మొదటిసారి విజయ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.