
కోలీవుడ్: తమిళ్ లేటెస్ట్ యాక్టింగ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి నటించిన ‘లాభం’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ‘డే లైట్ రాబరీ’ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమా రైతుల కష్టాలని మూల కథగా చేసుకొని తీసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా నటిస్తుండగా , శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ ఆరంభం లోనే విదేశీ కంపెనీలతో ఏదో డీల్ మాట్లాడుకునే సీన్ తో మొదలు పెట్టారు. ఆ తర్వాత వివిధ రకాల మిల్లులకు, అందరూ తినే ఆహారానికి రైతులు వ్యవసాయం చెయ్యాలి. అలాగే వ్యవసాయానికి, ఇలా వివిధ రకాల పరిశ్రమలకి కావాల్సింది ముడి సరుకులు. దాన్నే బిజినెస్ గా చేసుకుని చాలా మంది బతుకుతున్నారు. రైతులు మీద ఆధారపడిన వాళ్ళు బతుకుతున్నారు కానీ రైతులు నష్టపోతున్నారు అనే పాయింట్ ఈ సినిమాలో చెప్పబోతున్నారు.
రైతుల నష్టాలని పోగొట్టడానికి రివొల్యూషన్ తీసుకొచ్చే హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇక్కడ రైతు స్ట్రైక్ చేస్తే అది ముంబై లో ఉన్న మార్కెట్ పై, దాని ప్రభావం లండన్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ పైన పడుతది అని హీరో తాలూకు ప్రయత్నాల్ని చెప్పాడు. ఇలా సాగుతూ పోయే ఈ ట్రైలర్ హీరో కి విలన్ ని మధ్య వచ్చే సంబాషణతో ఒక పంచ్ డైలాగ్ తో ముగించారు. చివరగా ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు కనపడేట్లు ఒక చిన్న సీన్ ఆడ్ చేసి లాక్ డౌన్ తర్వాత విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని ఎస్ పి జానానాథన్ దర్శకత్వం వహిస్తుండగా, డి ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని అరుముగ కుమార్ తో పాటు విజయ్ సేతుపతి కూడా నిర్మిస్తున్నారు.