కోలీవుడ్: శ్రీలంక మాజీ ఇంటెర్నేషనల్ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు అయిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ మూవీ ‘800 ‘ అనే పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఈ మద్యే అధికారిక ప్రకటన చేస్తూ ఇందులో విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో నటించబోతున్నట్టు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు. కానీ మోషన్ పోస్టర్ విడుదల చేసినప్పటినుండి ఈ సినిమాకి రాజకీయం జోడించారు. ఈ సినిమాకి, శ్రీలంక లో తమిళులపై వివక్షని జోడించి రకరకాలుగా విజయ్ సేతుపతి ని టార్గెట్ చేస్తున్నారు. ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి‘ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
ఈ పరిస్థితుల మధ్య తన బయోపిక్ నుండి విజయ్ సేతుపతి ని వైదొలగాలని మురళీధరన్ సేతుపతి కి ఒక లేక రాశారు. మీ లాంటి మంచి యాక్టర్ ఈ సినిమా ద్వారా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేదన్నట్టు లేఖ రాశారు. ఈ సినిమా చాలా మందికి స్ఫూర్తి నింపుతుంది అనుకున్నానని కానీ ఇంత పెద్ద వివాదం అవుతుందని అనుకోలేదని తన లేఖ లో చెప్పాడు. ఈ సినిమా కారణంగా తమిళ్ సినిమా రంగంలోని గొప్ప నటుడు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ ‘థాంక్ యూ.. గుడ్ బై..’ అని ట్వీట్ చేసాడు. ఇంతటితో ఈ విషయంలో విజయ్ సేతుపతి ఈ వివాదానికి తాత్కాలితంగా ముగింపు పలికినట్లు అయింది.