చెన్నై: సినిమా హీరో అంటే కలర్ ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, ఫిట్ గా సన్నగా ఉండాలి లాంటివాటన్నిటిని చెరిపేసి నటన ఉంటె చాలు అని విలక్షణమైన పాత్రలు చేస్తూ సౌత్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు వేసి తన నటనా ప్రతిభ చాటారు. 2019 లో విడుదలైన ‘సూపర్ డీలక్స్‘ సినిమాలో ట్రాన్స్ జెండర్ కారెక్టర్ లో కూడా నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తెలుగులో కూడా ‘సైరా నరసింహ రెడ్డి ‘ లాంటి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరిశారు.
విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘తుగ్లక్ దర్బార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆన్ లైన్ లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ జోడీ కట్టబోతున్నారు, అలాగే రాధా కృష్ణన్ పార్థిబన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం వహిస్తున్నారు. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు.విజయ్ సేతుపతి నటించిన మరొక సినిమా ‘మాస్టర్‘ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఇళయదళపతి విజయ్ తో నటిస్తున్నారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.