fbpx
Thursday, November 21, 2024
HomeTelanganaఫార్మా సిటీ వివాదంలో కలెక్టర్‌ ప్రతీక్ యూటర్న్‌

ఫార్మా సిటీ వివాదంలో కలెక్టర్‌ ప్రతీక్ యూటర్న్‌

vikarabad-collector-controversy-in-pharma-city

వికారాబాద్‌: ఫార్మా సిటీ కోసం భూముల పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి జరిగినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది.

సోమవారం కలెక్టర్‌ భూముల పరిశీలనలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆయనపై చేయి చేసుకున్నట్లు వార్తలు చెలరేగాయి.

ఈ ఘటన తర్వాత పోలీసులు 55 మందిని అరెస్టు చేయగా, పలువురిపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు ప్రకటించారు.

అయితే, ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ తాజాగా వ్యాఖ్యానిస్తూ, తనపై దాడి జరగలేదని, తాను గ్రామస్థుల ఆహ్వానం మేరకే మాట్లాడేందుకు వెళ్లానని తెలిపారు.

అంతేకాకుండా, గ్రామస్తులు “మనవాళ్లే” అని వ్యాఖ్యానించడం గమనార్హం. కలెక్టర్ వ్యాఖ్యలతో అధికార యంత్రాంగంలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఈ యూటర్న్ వెనుక సర్కారు సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫార్మా సిటీ ఏర్పాటుకు సర్కారు కీలకంగా భావిస్తుండగా, గ్రామస్తులను ఒప్పించడానికి ఈ సంఘటనను మేనేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే కలెక్టర్‌ మాటలు మార్చినట్లు తెలుస్తోంది.

ఫార్మా సిటీ విషయంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ దిశగా సాగుతున్న ఈ వివాదం తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular