కోలీవుడ్: దేశం గర్వించదగ్గ నటుల్లో ఉండే మరో ముఖ్య నటుడు ‘విక్రమ్’. సినిమా కోసం దేని కైనా సిద్దపడే వ్యక్తి విక్రమ్. అపరిచితుడు సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు విక్రమ్. తాను నటించిన ‘ఐ’ సినిమా కోసం విక్రమ్ చూపించిన ట్రాన్సఫార్మేషన్ కి హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. తాను నటించే సినిమాల్లో కూడా ఎన్నో గెట్ అప్ లలో కనిపిస్తుంటాడు విక్రమ్.
కెరీర్ లో 59 సినిమాలు పూర్తి చేసిన విక్రమ్ తన 60 వ సినిమాలో నటిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాని ‘ఆదిత్య వర్మ’ పేరుతొ తమిళ్ లో రూపొందించి తన కొడుకు ధృవ్ విక్రమ్ ని పరిచయం చేసాడు హీరో విక్రమ్. ఈ సారి తన కొడుకు రెండవ సినిమాకోసం ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘మహాన్’ అనే టైటిల్ తో పాటు ఈ సినిమాలో విక్రమ్ లుక్ ని విడుదల చేసారు మేకర్స్.
బులెట్ పై నుండి వస్తూ ఒక రాక్షసుడిని రిప్రెసెంట్ చేస్తున్నట్టు నల్లటి బట్టలు, నెత్తి పై కొమ్ములు , చుట్టూ పది చేతులు ఇలా విక్రమ్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసారు. జిగర్తాండ, పేట లాంటి సినిమాలని రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా గురించి మరించ అప్ డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.