ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తండ్రయ్యారు. ఈ రోజు విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ అగ్ర నటి అయిన అనుష శర్మ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
“మాకు దేవుడు ఆడ బిడ్డను ప్రసాధించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనుష్క మరియు మా బిడ్డ ఇద్దరు ఆరోగ్యాంగా, క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాము. ప్రేమతో విరాట్” అని ఆయన ట్వీట్ చేశారు.
విరాట్, అనుష్క తొలి సంతానం కోసం ఆస్ట్రేలియా సిరీస్ లో మొదటి టెస్ట్ ఆది వెనక్కు వచ్చేశాడు. విరాట్ లేని వేళ అజింక్య రహానే కెప్టెంగా వ్యవహరిస్తున్నాడు. రహానే కెప్టెన్సీ లో భారత్ రెండో టెస్ట్ లో విజయం సాధించింది, మరియు మూడో టెస్ట్ ను డ్రాగా ముగించింది.