స్పోర్ట్స్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొత్త విధానం ప్రకారం, 45 రోజులకు పైగా ఉన్న విదేశీ టూర్‌లలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మొదటి రెండు వారాల తర్వాత మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అదీ కేవలం 14 రోజులు మాత్రమే.
దీనిపై కోహ్లీ స్పందిస్తూ, ఇది ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. “ఒత్తిడిలో ఉన్న సమయంలో కుటుంబ సమక్షం ఎంతో ముఖ్యం. కానీ, ఇప్పుడు మేము ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది” అని కోహ్లీ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అతను అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌పై సెంచరీ, సెమీఫైనల్‌లో 84 పరుగులతో జట్టు విజయానికి తోడ్పడ్డాడు.
ఇటీవల అనుష్క శర్మ స్టేడియంలో అతనికి మద్దతుగా కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ భార్య, కూతురు కూడా మ్యాచ్‌లకు హాజరయ్యారు. “ఆట తరువాత కుటుంబంతో గడిపే సమయం ఎంతో ముఖ్యం” అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
క్రికెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొనడంలో కుటుంబ సహకారం చాలా అవసరం అని కోహ్లీ అన్నారు. BCCI విధానం ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుందా? అనే చర్చలు జరుగుతున్నాయి.
భవిష్యత్తులో బీసీసీఐ ఈ నిబంధనపై మార్పులు చేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆటగాళ్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించడంతో, బీసీసీఐపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.