మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన కీలక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు.
340 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులకే అవుట్ కావడంతో, టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కోహ్లీ ఇటీవల సెంచరీ చేసిన పెర్త్ టెస్టు తర్వాత నిరుత్సాహకర ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నారు.
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్, కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ “ది కింగ్ ఈజ్ డెడ్” అని అన్నారు. కోహ్లీకి ఈ ఫామ్ దెబ్బ పెద్ద పరీక్షగా మారిందని, ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా అతని స్థానాన్ని తీసుకున్నాడని కటిచ్ పేర్కొన్నారు.
బుమ్రా ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో 12.83 సగటుతో ఇప్పటికే 30 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతను నిర్ణయించే చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. కోహ్లీ తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడా లేదా అన్న ప్రశ్న భారత అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.