- వేణు ఉడుగుల – పేరు చెప్పగానే చాలా తక్కువ మంది గుర్తించే వీలుంది
- నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు అంటే ఇంకొంతమంది గుర్తించే వీలుంది
- విరాటపర్వం దర్శకుడు అంటే కొంచెం ఎక్కువ మంది గుర్తించే వీలుంది
పైన చెప్పుకున్న ముగ్గురూ ఒక్కటే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కథల్లాగే ఆయన మాటలు కూడా నిజాన్ని దగ్గరగా నిగూడం లేకుండా ఉంటాయి.
కొందరు రచయితల మాటలు చెవుల వరకే, కొందరివి మెదడు వారికి చేరుతాయి కానీ మరికొందరి మాటలు గుండెనితట్టి లేపుతాయి అలాంటి వాళ్ళల్లో వేణు ఊడుగుల ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య ఆయన రాసిన ఒక రచన – పగడపు కన్నీరు- ఉద్యోగం కోసం / మంచి జీవితం కోసం వెళ్లిన పిల్లలకు దూరంగా ఉన్న తల్లి తండ్రుల వేదన ఆయన మాటల్లో చెప్పాలంటే
మంచానికి ఒక పక్క నేను ఒక పక్క మీ నాయన
ఒకరికి తెల్వకుండ ఒకరం కన్నీళ్లు పెట్టుకుంటిమి
మన నిత్య జీవితం లో ఎదో ఒక దశ లో పిల్లలకి దూరంగా పెద్దలు ఆ తరవాత పెద్దలకి దూరంగా పిల్లలు, అభివృద్ధి కోసమో, ఉన్నత అవకాశాల కోసమో కారణం ఏది అయితేనేం దూరం దగ్గర అయినప్పుడు దగ్గర దూవురం అవుతుంది. క్రమ క్రమంగా పిల్లలకి తల్లి తండ్రులకి దూరం పెరుగుతూనే ఉంది. ఇలా మన చుట్టూ పక్కల జరుగుతున్న రోజూ చూస్తూ ఉన్న అంశాన్ని ఒక రచన రూపంలో కళ్ళకి కట్టినట్టు రాసి కళ్ళు చెమ్మగిల్లేలా చేసిన వేణు ఉడుగుల గారికి కళాభివందనాలు.
అమర గాలి భస్మమైపోయింది
అసుర సంధ్య వేలకు ముందే కట్టెలన్నీ కాలి బూడిదలయ్యాయ్
కాటికాడ మా చెవుల్లో ఎంత సేపు పిల్చినా మేము రాము
ఎట్లొస్తమ్ చెప్పు మేము పిలిచినప్పుడు నువ్వొచ్చినవా ఎప్పుడైనా
ఇలాంటివి రాస్తే అభినందించకుండా ఎట్లుంటాం చెప్పు
మీలాంటి రచయితల కలం మన తెలుగు భాషకి మళ్ళీ పూర్వ కళ తీసుకురావాలని ఆశిస్తున్నాం