హీరో విశాల్ కొత్త సినిమా ‘చక్ర’. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని విశాల్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు రెజీనా కసాండ్ర శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ నాలుగు దక్షిణ భాషల్లో ట్రైలర్ తెలుగు వెర్షన్ ను దగ్గుబాటి రానా, తమిళ ట్రైలర్ ను హీరోలు కార్తి మరియు ఆర్య , మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ ట్రైలర్ రాకింగ్ స్టార్ యశ్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒకేసారి రిలీజ్ చేసారు.
సైబర్ క్రైమ్ నేపధ్యం లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడింది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా ద్వారా ఇండియా లో అన్ని ట్రాన్సాక్షన్స్ డిజిటల్ రూపం లో జరగాలి అనే కామన్ అంశం చుట్టూ మనం దైనందిన జీవితం లో జరిపే ట్రాన్సాక్షన్స్ పైన సైబర్ క్రైమ్ జరిగితే ఎలా ఉంటుంది, అది ఒకేసారి క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతుంది దాని తదుపరి పరిస్థితులు ఏంటి, ఇన్వెస్టిగేషన్ లాంటివి బేస్ చేసుకొని సినిమాని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. యాక్షన్ ఘట్టాలు అన్ని హీరోయిజమ్ ఎలివేషన్ కోసం రూపొందించబడినట్లు గా ఉన్న సినిమాలో సిట్యుయేషన్ కి అతికినట్లే అనిపిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో ”నేషనల్ సెక్యూరిటీ అనేది డిజిటల్ ఇండియా యొక్క కల” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ కూడా జత చేసారు.ఈ సినిమా కూడా అభిమన్యుడు తరహా లోనే రాబరీ, సైబర్ క్రైమ్ నేపధ్యం లో అంతకన్నా ఎక్కువ సాంకేతిక అంశాలతో రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.