కోలీవుడ్: తమిళ హీరో గా హిట్, ప్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు విశాల్. ప్రస్తుతం విశాల్ రెండు మూడు సినిమాల్లో ఒకే సారి నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఒక సినిమాలో యాక్షన్ షూట్ లో తీవ్రం గా గాయపడ్డాడు. విశాల్ నుండి వస్తున్న సినిమాల్లో ‘ఎనిమి’ ఒకటి. ఈ సినిమాలో మరో తమిళ్ హీరో ఆర్య నటిస్తున్నాడు. ఆర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేసారు.
టీజర్ ఆరంభం లో బిల్డింగ్ ఎడ్జ్ నుండి సిటీ ని చూస్తున్న విశాల్ ని, జైలు లో నుండి సిటీ ని చూస్తున్న ఆర్య ని చూపించారు. తర్వాత ఫ్రేమ్ నుండి పూర్తిగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో టీజర్ ని పాక్ చేసారు. హై లెవెల్ యాక్షన్ స్తంట్స్ మరియు ఛేజ్ లు చూపించారు. ఫారెన్ రోడ్స్ పైన కార్ మరియు బైక్ ఛేజ్ లు ఆసక్తికరంగా రూపొందించారు. చివర్లో ఆర్య కి మరియు విశాల్ కి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉన్నట్టు చూపించి బ్యాక్ గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ తో ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’ అనే డైలాగ్ తో టీజర్ ముగించారు. చూస్తుంటే ఫ్రెండ్స్ గా ఉండే ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా మారారు అన్న ఎలిమెంట్ ఉందనున్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా , సామ్ సి.ఎస్ బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నాడు. సినిమాలో ఆర్య , విశాల్ తో పాటు మృణాళిని రవి, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్ నటించనున్నారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.