కోలీవుడ్: కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశం లో కమ్యూనిటీ వ్యాప్తి స్టేజి లో ఉంది. ఇంతకముందు లేనంత గా కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతూ వస్తుంది. ఈ వైరస్ ఎవ్వరిని వదలకుండా తనకి అడ్డొచ్చిన వాళ్ళందరిని కబళిస్తుంది. మొన్నటివరకు స్మాల్ స్క్రీన్ వరకే పరిమితం అయిన కరోనా ఇప్పుడు పెద్ద పెద్ద తారలకు కూడా కరోనా బాధలు తప్పట్లేదు. ఇప్పుడు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కి కరోనా ఉన్నట్టు ఆఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముందుగా తన నాన్నకి కరోనా వచ్చిందని, తనతో పాటు ఉన్నందుకు తనకి కూడా లక్షణాలు ఉన్నాయని అలాగే తన మేనేజర్ కి కూడా కరోనా పాజిటివ్ అని చెప్పారు విశాల్. అలాగే తాము ఆయుర్వేదిక్ మందులు తీస్కొని వారం రోజుల్లో నయం అవ్వగలిగామని చెప్పారు విశాల్. ప్రస్తుతం మేము హెల్తీ గా హ్యాపీ గా ఉన్నామని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫామిలీ మొత్తానికి కరోనా వచ్చింది. శాండల్ వుడ్ లో ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత ఎంపీ సుమలత కి వచ్చి నయం ఐంది. అలాగే తమిళ్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య కి కూడా కరోనా వచ్చింది. ఇపుడు విశాల్ కూడా ఈ వైరస్ భారిన పడి కోలుకున్నారు. ఇలా సెలబ్రిటీస్ తమకి వచ్చిన రోగాన్ని దాచుకోకుండా అందరికీ తెలియచేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆనందం కలిగించే విషయం.