fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఫిబ్రవరి 19 న విశాల్ 'చక్ర'

ఫిబ్రవరి 19 న విశాల్ ‘చక్ర’

VishalChakraMovie ReleaseDate Announced

కోలీవుడ్: కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం ‘చక్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. చివరగా ‘అభిమన్యుడు’ అనే సినిమాతో హిట్ కొట్టిన విశాల్ మరోసారి సైబర్ క్రైమ్స్ నేపధ్యం లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రస్తుతం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ కి జోడీ గా శ్రద్ధ శ్రీనాథ్ మరియు ఒక ప్రత్యేక పాత్రలో రెజీనా నటిస్తుంది.

ఒక స్టైలిష్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ లో విడుదల చేస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ థియేటర్లు తెరచుకుని జనాలు థియేటర్లలో సినిమాలని ఆదరిస్తుండడం తో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాతో యువన్ శంకర్ రాజా మరోసారి విశాల్ తో పని చేయనున్నాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ్,కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular