యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్‌లో మరో కీలక దశను ఎదుర్కొంటున్నాడు. ‘లైలా’ సినిమాతో నిరాశ ఎదుర్కొన్న అతను తన మార్కెట్‌ను బలంగా నిలబెట్టుకునేలా కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం “ఫంకీ” అనే సినిమాలో నటిస్తుండగా, ఈ మూవీ విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాను అనుదీప్ కెవి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుదీప్ గతంలో ‘జాతిరత్నాలు’తో హిట్ అందుకున్నా, ‘ప్రిన్స్’ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అనుదీప్, విశ్వక్ ఇద్దరికీ కీలకం.
కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపిక అయ్యే అవకాశం ఉందని టాక్. ‘ఫంకీ’తో పాటు, విశ్వక్ ‘జిత్తూ పటేల్’ అనే మాస్ యాక్షన్ సినిమా కోసం కూడా సైన్ చేశాడు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు.
ఇంకా ఓ హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశ్వక్, ప్రస్తుతం తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అతనికి కమ్‌బ్యాక్ అవుతాయా అనేది చూడాలి.