మూవీడెస్క్: యువ హీరో విశ్వక్ సేన్ తనదైన స్టైల్‌లో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా షూటింగ్ పూర్తి దశలో ఉంది.
సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశ్వక్ సేన్ అమ్మాయిలా కనిపించనున్న ఓ సరికొత్త లుక్ ఇప్పటికే విపరీతమైన స్పందన అందుకుంది.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.
సేన్ స్టైలిష్ అవతారంలో ట్రెండీ లుక్, సన్‌గ్లాసెస్‌తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మరో సర్‌ప్రైజ్ కూడా ప్రకటించారు.
2025 జనవరి 1న లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. విశ్వక్ సరసన ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.