టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ తగ్గి థియేటర్లు తెరచుకుని రెండు వారాలుగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటి వారికి తిమ్మరుసు, ఇష్క్, SR కల్యాణమండపం లాంటి చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం మరో సినిమా విడుదల అవనుంది. విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ సినిమా ఈ వారం విడుదల అవనుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదల చేసారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీ గా ‘నివేత పేతురాజ్‘, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ట్రైలర్ ఆరంభంలోనే హీరో కనిపించిన అమ్మాయిలందరికి పువ్వులు ఇచ్చి ప్రొపోజ్ చేస్తుండడం చూపిస్తారు. కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యు చెప్పుకుంటూ పోతుండడం తన ఫ్రెండ్ ‘కరోనా ఉన్నోళ్ళతోనైనా తిరగొచ్చు గాని నీ లాంటి కరువులో ఉన్న వాడితో తిరగకూడదు’ అన్నట్టు చెప్పే డైలాగ్ తో కామెడీ చూపించారు. తర్వాత ‘నివేత పేతురాజ్’ రూపం లో హీరోకి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి నుండి తాను ప్రేమలో ఉన్న అమ్మాయిని మెప్పించడానికి ఆ అమ్మాయి ప్రేమని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కామెడీ తో మొదలైన ట్రైలర్ ఎమోషనల్ గా ముగించారు. ఓవరాల్ గా ట్రైలర్ ద్వారా ఒక మంచి ఎమోషనల్ రైడ్ చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు.
ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, మహేష్ ఆచంట నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరియు లక్కీ మీడియా బ్యానర్స్ పై దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రధాన్ సంగీతం లో ఈ సినిమా రూపొందుతుంది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఆగష్టు 14 న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.