టాలీవుడ్: ‘వెళ్ళిపోమాకే’ సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు విశ్వక్సేన్. ఈ సినిమాలో క్లాస్ ,సైలెంట్ రోల్ లో నటించాడు. ఆ తరవాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా కొంచెం గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత తన సొంత దర్శకత్వంలో మరియు సొంత బ్యానర్ లో చేసిన ‘ఫలక్ నమ దాస్’ సినిమా ద్వారా అనూహ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అప్పటి నుండి విశ్వక్ సేన్ వెనుతిరిగి చూసుకుంది లేదు. లాక్ డౌన్ కి కొంచెం ముందు నాని నిర్మాణంలో ‘హిట్’ అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ద్వారా హిట్ పొందాడు. ప్రస్తుతం మరొక రీమేక్ సినిమా ప్రారంభించాడు ఈ యువ హీరో. తమిళ్ లో 2020 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘ఓహ్ మై కడవులే’. ఈ సినిమా కి మంచి టాక్ రావడంతో ఈ సినిమాని విశ్వక్సేన్ తో రీమేక్ చేయనున్నారు.
పీవీపీ సినిమాస్ మరియు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పొట్లూరి ప్రసాద్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంభాషణలు ‘తరుణ్ భాస్కర్’ అందించనున్నారు. తమిళ్ ఒరిజినల్ సినిమాని రూపొందించిన అశ్వంత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సినిమాతో పాటు విశ్వక్సేన్ మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని కూడా రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి యువ హీరో ల వరకు అందరూ రీమేక్ కథలపై ఆధారపడడం కొత్త రచయితలకి మరియు కొత్తదనాన్ని కోరుకునే సినిమా అభిమానులకి చేదు వార్తే. ఈ విషయాన్నీ ఇండస్ట్రీ పెద్దలు గుర్తించి కొత్త కథల్ని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీ న్యూ టాలెంట్ తో కల కళలాడుతుంది.