మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ పెంచగా, ఇప్పుడు హైదరాబాద్ శంకర్ పల్లి వద్ద చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా గ్రాండ్ సెటప్ రూపొందించగా, శోభి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ మాస్ ఇంట్రో సాంగ్‌కు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్ అదిరిపోయిందని చిత్రబృందం చెబుతోంది. స్టిల్‌లో కార్ నుంచి దిగుతున్న చిరు లుక్ అభిమానుల్లో హంగామా క్రియేట్ చేస్తోంది.
దర్శకుడు వశిష్ట తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం, పాన్-ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హై-ఎండ్ గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయని యూనిట్ చెబుతోంది.
ఇప్పటికే ఇంట్రో సాంగ్ హైప్ క్రియేట్ చేయగా, సినిమా విడుదలకు ముందే విశేషమైన ఆసక్తి పెరుగుతోంది. చిరు మాస్ ఎంట్రీ, వశిష్ట విజువల్ ట్రీట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి థియేటర్లలో ఈ సినిమా ఎంతగా అలరిస్తుందో చూడాలి.