మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా తెరకెక్కుతున్న విజువల్ గ్రాండియర్ విశ్వంభర పై భారీ అంచనాలు ఉన్నాయి.
యువ దర్శకుడు వశిష్ఠ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
టీజర్ విడుదలైన తర్వాత, గ్రాఫిక్స్ పనిపై కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో మేకర్స్ మరింత కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తోంది.
అయితే, తాజాగా “కల్కి 2898 ఏ.డి” దర్శకుడు నాగ అశ్విన్ “విశ్వంభర” విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో భాగమయ్యాడనే వార్తలు వినిపించాయి.
కల్కి సినిమాకు పని చేసిన టీమ్ విశ్వంభరకూ సహకరిస్తుందంటూ పుకార్లు వచ్చాయి.
కానీ, తాజా సమాచారం ప్రకారం నాగ అశ్విన్ ప్రస్తుతం “కల్కి 2” ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
విశ్వంభర కోసం వేరే టీమ్ పనులు చూస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, “విశ్వంభర” విజువల్స్ కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఈ సినిమా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మేలో థియేటర్లలో సందడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి.