టాలీవుడ్: ‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల ద్వారా తొలి అడుగులు వేసిన హీరో విశ్వక్సేన్, కానీ ‘ఫలక్ నమ దాస్’ సినిమా తర్వాత బాగా ఫేమ్ అయ్యాడు. కరోనా కి కొద్దిగా ముందు ‘హిట్’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ హీరో ‘పాగల్’ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు మూవీ టీం. ఏప్రిల్ 30 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో, లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి లవ్ స్టోరీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ ప్లేబాయ్ రోల్ లో కనిపించనున్నట్టు కొన్ని వార్తలు ఉన్నాయి. నరేష్ కుప్పిలి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి మణి కందన్ ఛాయా గ్రహణం చేస్తుండగా ‘రాడాన్’ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 30 న రానా విరాట పర్వం కూడా విడుదల అవుతుండడం తో ఈ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వనుంది.