మూవీడెస్క్: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా షూటింగ్ పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమాతో రవితేజ ముళ్ళపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విశ్వక్ కి జోడీగా నటించింది.
కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ఒక భిన్నమైన లవ్ స్టొరీ హైలెట్ అవుతుందట. ఇక విశ్వక్ ఈ ఏడాది చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
ఇప్పటికే మేకర్స్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విడుదల తేదీని తొలగించడం ఈ వార్తను బలపరుస్తోంది.
దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్‘ కూడా దీపావళి రేసులో ఉండటంతో, ఇరువురు హీరోలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
రెండు చిత్రాలు కూడా మీడియం రేంజ్ మూవీస్‌గా రాబోతున్నాయి, కాబట్టి ప్రేక్షకుల్లో సానుకూల స్పందన ఉండొచ్చని భావిస్తున్నారు.
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
నవంబర్ 7న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.