మూవీడెస్క్: విశ్వం మూవీ రివ్యూ & రేటింగ్ (VISWAM MOVIE REVIEW AND RATING)
కథ:
సిటీలో వరుసగా జరుగుతున్న బాంబ్ బ్లాస్టులు తీవ్ర భయాందోళనకు కారణమవుతాయి. ఈ ఘటనల్లో ఓ మంత్రి కూడా మరణిస్తాడు.
అయితే, ఈ దాడిని ఓ చిన్న పిల్ల మనసులో దాచుకుంటుంది. ఈ క్రమంలో ఆ చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, కథా నాయకుడు (గోపీచంద్) ఆ పాపను ఎలా కాపాడాడు?
ఇంతకు ఆ పాపను ఎవరు టార్గెట్ చేస్తారు? ఈ నేపథ్యంలో, కథానాయికతో లవ్ స్టోరీ ఎలా ముడిపడింది? బాంబ్ బ్లాస్టుల వెనుక ఉన్న నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
విశ్లేషణ:
గోపీచంద్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఈ సినిమా పూర్తిగా నడిపించాడు. హీరోయిజం ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. కొన్నీ యాక్షన్ బ్లాక్స్ మంచి ఆదరణ పొందాయి.
కామెడీ పాత్రలు కొన్ని చోట్ల నప్పాయి, కానీ మరికొన్ని రొటీన్ గా ఉన్నాయి. హీరోయిన్ కావ్య పాత్ర పర్వాలేదనిపించింది, కానీ ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.
కామెడీ, యాక్షన్ అంశాల వివరాల్లోకి వెళితే, శ్రీనువైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా పృథ్వీ పాత్ర హైలెట్ అయ్యింది.
యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి, కానీ పూర్తి స్థాయిలో కధనంలో కొత్తదనం లేదని చెప్పాలి.
ఎడిటింగ్, స్క్రీన్ ప్లే పరంగా సినిమా చాలా సాధారణంగా ఉంది. కథ కాస్త డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది, కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి.
సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరిపోయే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అందంగా ఉంది.
మొత్తంగా విశ్వం ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా కోసం భారీ అంచనాలు పెట్టుకోకుండా, కేవలం వినోదం కోసం మాత్రమే వెళ్లేవారికి పర్లేదనిపిస్తుంది.
అయితే, కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు, భారీ పాన్ ఇండియా మూవీస్ చూస్తున్న ప్రేక్షకులకు ఇది పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
మరి పూర్తి స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రోజులు నిలదొక్కుకుంటుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
గోపిచంద్ క్యారెక్టర్
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
రొటీన్ కథనం
రెగ్యులర్ లవ్ సీన్స్
రేటింగ్: 2.5/5