టాలీవుడ్: థియేటర్ లు తెరచుకున్నా కూడా ఇంకా కొన్ని సినిమాలు ఓటీటీ ల్లో విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం కమెడియన్ సత్య హీరో గా నటించిన ‘వివాహ భోజనంబు’ అనే సినిమా ఆగష్టు చివరి వారంలో సోనీ liv ఓటీటీ లో విడుదల అవనుంది. హీరో సందీప్ కిషన్ కి సంబందించిన వేంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.
కరోనా టైం లో పెళ్లి చేసుకున్న ఒక పిసినారి యువకుని కథ ఇది. పెళ్లి అవగానే కరెక్ట్ గా లాక్ డౌన్ విధించడం తో పెళ్లి కూతురు తరుపు బంధువులు అందరూ దాదాపు నెల రోజులు హీరో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన హీరో అంత మందితో తన ఇంట్లో లాక్ డౌన్ సమయంలో ఎలా భరించాడు, తన పిసినారి తనంతో ఎలాంటి కామెడీ జెనెరేట్ చేసాడు, వాళ్ళని ఊరికి పంపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు అనే కాన్సెప్ట్ తో ఫామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. దాదాపు రియల్ ఇన్సిడెంట్స్ తోనే ఈ సినిమా రూపొందినట్టు మేకర్స్ ప్రకటించారు.
స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సత్య హీరో గా నటించిన మొదటి సినిమా ‘వివాహ భోజనంబు’. తెలుగు లో ఓటీటీ రంగం లో స్థిరపడడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న సోనీ liv ఈ సినిమాని కొని ఓటీటీ లో ఈ నెల 27 న విడుదల చేస్తున్నారు. రామ్ అబ్బరాజు అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు.