ముంబై: బాలీవుడ్‌కు మరొక చేదు వార్తగా సాజిద్-వాజిద్ ఫేమ్ సంగీత స్వరకర్త వాజిద్ ఖాన్ ముంబై ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు తమ బాధను మరియు శోకం లో ఉన్న వాజిద్ ఖాన్ కుటుంబానికి సంతాపాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తెలియచేసారు. ప్రముఖ స్వరకర్త యొక్క మరణంపై ప్రియాంక చోప్రా జోనాస్ తన విచారాన్నితెలుపుతూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.
ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్, సోను నిగమ్ కూడా స్వరకర్త ద్వయం ఉన్న ఫోటోతో పాటు ఫేస్‌బుక్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు, ప్రముఖ స్వరకర్త అకస్మాత్తుగా కన్నుమూసినందుకు తన బాధను వ్యక్తం చేశారు.
కరోనావైరస్ వలన మూత్రపిండాల సమస్య తలయెత్తి వాజిద్ ఖాన్ 42 వయస్సులో సోమవారం ఉదయం 4 గంటలకు ముంబై ఆసుపత్రిలో కన్నుమూశారు. సల్మాన్ ఖాన్ యొక్క ప్రసిద్ధ చిత్రాలైన ‘వాంటెడ్’, ‘దబాంగ్’ మరియు ‘ఏక్ థా టైగర్’ లకు సంగీత దర్శకుడు గా వాజిద్ ఖాన్ పేరుగాంచారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఖాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు సమక్షం లో ఖననం చేయబడింది. ముంబైలో కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా, 20 మందిని మాత్రమే అంత్యక్రియలకు అనుమతించారు.
వాజిద్ తన సోదరుడు సాజిద్‌తో కలిసి రియాలిటీ షోలు ‘సా రే గా మా పా 2012’ మరియు ‘సా రే గా మా పా సింగింగ్ సూపర్ స్టార్’ షోలకు న్యాయ నిర్ణేత గా చేశారు. స్వరకర్త ద్వయం ఐపిఎల్ 4 థీమ్ సాంగ్ ‘ధూమ్ ధూమ్ ధూమ్ ధడకా’ ను కూడా స్వరపరచి పాడారు.