ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగబద్ధతపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక విచారణ జరిగింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ముస్లిం మత స్థలాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో కొత్త మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు పౌరులు, సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
వక్ఫ్ బిల్లుపై సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వారం గడువు కోరింది. దీనిపై సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అదే సమయంలో విచారణ కొనసాగుతున్నంత వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం హామీ ఇచ్చింది.
ఇంతకీ వివాదాస్పద అంశం ఏమిటంటే.. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులను నియమించే అంశం. దీనిపై బహుళ అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ముస్లిమేతర సభ్యుల నియామకాన్ని నిలిపివేయాలని పేర్కొంది.
విచారణను తదుపరి దశలో కొనసాగించేందుకు సుప్రీంకోర్టు మే 5 తేదీని ఖరారు చేసింది. అప్పటివరకు కేంద్రం తగిన సమాధానాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కేసు ఫలితంపై దేశవ్యాప్తంగా ముస్లిం మత సంస్థలు, పౌర హక్కుల సంఘాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
wakf, supreme court, amendment bill 2025, constitutional challenge, muslim properties,