fbpx
Wednesday, March 12, 2025
HomeMovie Newsవార్ 2 – కూలీ.. క్లాష్ కాకుండా న్యూ ప్లాన్!

వార్ 2 – కూలీ.. క్లాష్ కాకుండా న్యూ ప్లాన్!

war2-coolie-release-strategy

2025లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా వార్ 2 – కూలీ హైలైట్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2, రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కూలీ రెండూ కూడా భారీ అంచనాలు సొంతం చేసుకున్నాయి.

ఇటీవల, ఈ రెండు చిత్రాలు ఒకే తేదీకి లాక్ అవుతాయని వార్తలు వచ్చాయి. అసలు కూలీ ఆగస్టు 14 విడుదల రావాల్సినప్పటికీ, అదే రోజున వార్ 2 కూడా రావడంతో థియేట్రికల్ షేర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందుకే, నిర్మాతలు ముందుగానే వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, కూలీ విడుదలను కొద్దిగా వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కు ప్లాన్ చేయాలని టాక్. విడుదల తేదీలు కుదరకపోతే, రెండు సినిమాల ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుల హక్కులపై ఇప్పటికే భారీ డిమాండ్ నెలకొంది. డిస్ట్రిబ్యూషన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. రెండు సినిమాలూ వెయ్యి కోట్ల బిజినెస్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు వ్యాపారపరంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular