హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా షెడ్యూల్ అనుకోని కారణాల వల్ల బ్రేక్ తీసుకుంది. బాలీవుడ్‌లో భారీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో హృతిక్ రోషన్ గాయపడ్డారు. ఓ డాన్స్ రిహార్సల్ సమయంలో ఆయనకు గాయం అవ్వడంతో వైద్యులు విశ్రాంతి సూచించారని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. అయితే, హృతిక్ గాయం కారణంగా కొన్ని కీలక సన్నివేశాలు వాయిదా పడే అవకాశం ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, ఈ ఆలస్యం సినిమా విడుదలపై ప్రభావం చూపించొచ్చని టాక్.
ఆగస్టు 14న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు షెడ్యూల్ మార్పులు అనివార్యంగా మారాయి. ఎన్టీఆర్ తదుపరి సినిమాల షెడ్యూల్ విషయంలో కూడా మార్పులు వస్తాయా అన్నది ఆసక్తిగా మారింది.
హృతిక్ రికవరీ పూర్తయిన తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.