సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తీసుకున్న తాజా నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. రిటైరైన క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని సీఏ ఎత్తివేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
2018లో జరిగిన సాండ్ పేపర్ వివాదం కారణంగా స్మిత్, వార్నర్‌లు ఏడాది నిషేధానికి గురవగా, వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించారు.
తాజాగా సీఏ తీసుకున్న నిర్ణయం వల్ల రాబోయే బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు వార్నర్ కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. 2023లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన తర్వాత, కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయమని వార్నర్ చేసిన విజ్ఞప్తి పట్ల సీఏ సానుకూలంగా స్పందించింది.
సీఏ ప్యానెల్ సమీక్ష అనంతరం అతడి ప్రవర్తన బాగుందని, నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా సాండ్ పేపర్ ఘటన బాధ్యత తీసుకున్న వార్నర్.. ఇప్పుడు కెప్టెన్సీ నిషేధం తొలగింపుతో బిగ్ బాష్‌లో మరోసారి నాయకత్వం వహించనున్నాడు. ఈ చర్య క్రికెట్ ప్రపంచంలో ఆశ్చర్యం కలిగిస్తూ, సీఏ నిర్ణయాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.