హాలీవుడ్: టామ్ అండ్ జెర్రీ కామిక్ క్యారెక్టర్స్ తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి ఉండదు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అన్ని వయసుల వాల్లు ఈ కామిక్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా ఈ కామిక్స్ ని చూస్తూ ఉంటారు. ఒక ఎలుక మరియు పిల్లి ల మధ్య జరిగే చిన్న చిన్న ఫైట్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఈ కామిక్ కి మూలం. ఇన్నిరోజులు చిన్న చిన్న కామిక్ ఎపిసోడ్స్ గా అలరించిన ఈ కామిక్ షో ఇపుడు సినిమా గా రాబోతుంది. దీనికి సంబందించిన ట్రైలర్ ఈ మధ్యనే విడుదల అయింది.
ట్రైలర్ ఆరంభంలో ఇన్ని రోజులు ఒక వూర్లో ఉండే టామ్ మరియు జెర్రీ సిటీ కి బయల్దేరుతారు. బయలుదేరే క్రమం లోనే ఎప్పటిలాగే టామ్ బస్సు ఎటాక్ తో బుక్ అయిపోతాడు. సిటీ కి ఒంటరిగా బయలుదేరిన జెర్రీ ఒక పెద్ద స్టార్ హోటల్ లో చిన్న ఇల్లు లాగ ఏర్పరచుకుని అక్కడ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ హోటల్ లో ఈ ఎలుక బాధ తప్పించుకోవడానికి ఆ హోటల్ మేనేజ్మెంట్ ఒక పిల్లిని తీసుకొస్తుంది అదే టామ్. అక్కడి నుండి వీళ్లిద్దరి కామెడీ ఫైట్స్ కొనసాగుతూ ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ కామిక్ ఫాన్స్ కి ఈ సినిమా మంచి ఫీస్ట్ అవుతుంది అనడం లో సందేహం లేదు. కానీ 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో ఉండే కామిక్స్ ని ఎంజాయ్ చేసిన జనాలు సినిమా మొత్తాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది చూడాలి.