అమరావతి: అన్యాయాన్ని ఉపేక్షించం అంటూ వైఎస్ జగన్ కూటమిపై మండిపాటు
కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. పోలీసులు చట్టాన్ని కాపాడడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారన్నారు. ‘‘మీరు చంద్రబాబు చూపించిన వారికి కాకుండా, మీ నెత్తిన ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలి’’ అని ఆయన అధికారులకు హితవు పలికారు.
‘అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టం’
వైఎస్ జగన్ తన పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు. అధికారులను వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, అన్యాయంలో భాగస్వామ్యం కాకూడదని సూచించారు.
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మండిపాటు
వైఎస్ జగన్, కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను విజయవాడ జైలులో కలిశారు. వంశీపై అక్రమంగా కేసులు పెట్టారని, అరెస్ట్ అన్యాయమని ఆయన ఆరోపించారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ‘‘వంశీపై కేసు పెట్టలేదని బాధితుడు కోర్టుకు చెప్పినా, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు’’ అని విమర్శించారు.
వంశీ అరెస్ట్: ‘లా అండ్ ఆర్డర్’ పతనం
‘‘వంశీ అరెస్ట్ రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని చూపిస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించిన ఆయన, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. టీడీపీ ఎప్పటికీ అధికారంలో ఉండదని, వైసీపీ అధికారంలోకి రాగానే అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టమని ఆయన పడే పడే బెదిరింపులకు దిగారు.
పట్టాభి రెచ్చగొట్టిన ఘటన
వైఎస్ జగన్, టీడీపీ నేత పట్టాభి వల్లభనేని వంశీని కావాలనే రెచ్చగొట్టారని ఆరోపించారు. 2023 ఫిబ్రవరిలో టీడీపీ కార్యాలయంలో పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేశారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని గన్నవరంకు పంపించి దాడికి ప్రేరేపించారని జగన్ ఆరోపించారు.
కూటమిపై మాస్ వార్నింగ్
వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అన్యాయంలో భాగస్వామ్యం అయిన ఎవరినీ వదిలిపెట్టం. ప్రజలు, దేవుడు శిక్షించే రోజు దగ్గరలో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.